నివర్ తుపాన్ బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందిస్తామన్న ప్రభుత్వం ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడం శోచనీయమన్నారు. నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేశారు.
తుపాన్ బాధితులను ఆదుకోవాలని జనసేన కార్యకర్తలు ర్యాలీ - జనసేన కార్యకర్తలు ర్యాలీ
నివర్ తుపాన్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు ర్యాలీ చేశారు. ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. నష్టపోయిన రైతులకు తక్షణ సహాయం అందిస్తామన్న సర్కార్ ఇప్పటికీ పరిహారం చెల్లించకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
జనసేన కార్యకర్తలు ర్యాలీ
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నదాతలకు తక్షణ సహాయం అందిస్తామని చెప్పిన వ్యవసాయ శాఖ మంత్రి... ఆ మాటను మరిచిపోయారని ఎద్దేవా చేశారు. సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు తక్షణ సహాయం ఎకరాకు రూ.35 వేల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.