ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Janasena fight: నిరుద్యోగుల కోసం జనసేన పోరాటం.. ఉపాధి కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తం - విశాఖ జిల్లాలో ఉపాధి కార్యాలయాన్ని ముట్టడించిన జనసేన నేతలు

ఉద్యోగ ఖాళీల భర్తీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. పలు జిల్లాలో ఉపాధి కల్పన కార్యాలయ అధికారికి నేతలు వనతి పత్రం అందజేశారు. పలు చోట్ల నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జనసేన నేతలు
జనసేన నేతలు

By

Published : Jul 20, 2021, 12:01 PM IST

Updated : Jul 20, 2021, 12:53 PM IST

నిరుద్యోగుల కోసం జనసేన పోరాటం.. ఉపాధి కార్యాలయాల ముట్టడి ఉద్రిక్తం

ఉద్యోగ ఖాళీల భర్తీలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ....నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పనా కార్యాలయంలో వినతిపత్రం ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే... ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

విశాఖ జిల్లాలో...

విశాఖలో ఉపాధి కార్యాలయాన్ని జనసేన నేతలు ముట్టడించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఉపాధి కార్యాలయానికి 200 మీటర్ల పరిసరాల్లో పోలీసుల మోహరించారు. పోలీసుల వలయం నుంచి తప్పించుకుని జనసేన నేతలు ఉపాధి కార్యాలయం ముట్టడించారు. కొత్త జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడం గమనించిన అధికారులు... ఉపాధి కార్యాలయానికి తాళం వేశారు. ఉపాధి కార్యాలయ అధికారిని బయటే జనసేన కార్యకర్తలు కలిశారు. ఈ చర్యతో విశాఖ జిల్లాలోని కంచరపాలెం, ఊర్వశి కూడలి, ఐటీఐ కూడలిలో పోలీసుల మోహరించారు. జనసేన నేతలను గృహనిర్బంధం చేశారు.

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లాలో పలుచోట్ల జనసేన నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఉపాధి కల్పనా కార్యాలయంలో వినతిపత్రం అందజేయనున్నట్లు జనసేన పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు ముందుగానే జనసేన నాయకులను గృహనిర్బంధం చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తే అదుపులోకి తీసుకోవడం ఏమిటని నేతలు ప్రశ్నించారు.

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరులో జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి, మురళీ మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు.ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలని జాబ్ క్యాలెండర్ లో చేర్చాలని డిమాండ్ చేస్తూ.. నెల్లూరు జిల్లాలో ఉపాధి అధికారికి వినతి పత్రం అందచేసే కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు.

విజయనగరం జిల్లాలో...

పోలీసు ఆంక్షలు, గృహనిర్భంధాలను చేధించుకుని జనసేన పార్టీ విజయనగరం జిల్లా నేతలు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయ అధికారి రవీంద్రకి వినతిపత్రం అందచేశారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో ప్రభుత్వ తీరుతో.. నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే.. ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

JANASENA: నిరుద్యోగుల సమస్యలపై జనసేన పోరాటం.. నేతల గృహ నిర్భంధం

Last Updated : Jul 20, 2021, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details