ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆవు మృత్యువాత పడిన ఘటనపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవటంపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ గేట్ వద్ద గోపూజ చేసి తమ నిరసనను తెలిపారు. విశాఖ విశ్వ హిందూ పరిషత్ సైతం తన నిరసనను తెలియజేసింది.
ఏయూ సెక్యూరిటీ గోమాత నిర్బంధంలోకి తీసుకుని చంపడం ఒక నేరమైతే.. సంబంధిత పోలీస్ స్టేషన్కు సమాచారమివ్వకుండా విశ్వవిద్యాలయం పరిధిలో ఖననం చేయడం మరో నేరమని ఆరోపించారు. జరిగిన సంఘటనపై కనీస చర్యలు మాని.. కమిటీల పేరుతో కాలయాపన చేయడం సరికాదని విమర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేయడం గాని, గోమాత యజమానికి నష్టపరిహారం చెల్లించకపోవడంపై నాయకులు మండిపడ్డారు.