విధి నిర్వహణలో ఉండి గాయపడిన విశాఖ జిల్లా జి మాడుగల మండల సత్యవరానికి చెందిన రమేష్ కుటుంబాన్ని జనసేన ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్... ప్రమాదవశాత్తూ విద్యుత్ స్తంభం పైనుంచి కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు. ప్రస్తుతం మంచానికే పరిమితం కావటంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో స్పందించిన మాడుగుల జనసేన పార్టీ నాయకులు, యువత సమిష్టిగా 21 వేల నగదును, నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందించారు. కుటుంబానికి అన్నివిధాలా సాయంగా ఉంటామని భరోసానిచ్చారు.
ఆ కుటుంబానికి అండగా జనసేన - మాడుగుల జనసేన న్యూస్
విధి నిర్వహణలో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు రమేష్. దీంతో ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాన్ని జనసేన నాయకులు ఆదుకున్నారు. ఆర్థిక సాయంతో పాటు ఒక నెలకు సరిపడా నిత్యావసర వస్తువులను అందజేశారు.

బాధిత కుటుంబానికి అండగా జనసేన