JanaSena Leaders Harsh Comments on CM Jagan: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దసరా తర్వాత విశాఖపట్నం జిల్లా నుంచి పరిపాలన సాగిస్తామని పలుమార్లు జగన్ చేసిన వ్యాఖ్యలకు తగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఉత్తర్వుల్లో.. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, వసతి సదుపాయం, మంత్రులు, సీనియర్ అధికారులకు ట్రాన్సిట్ వసతి గుర్తింపు కోసం అధికారుల కమిటీని నియమిస్తున్నట్లు పేర్కొంది.
Janasena Fire on Govt Orders:ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలును సీఎం సమీక్షించాల్సి ఉందని, దీని కోసం ముఖ్యమంత్రి జగన్విశాఖలో ఉండాల్సిన అవసరం ఉందని.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉత్తర్వులపై, సీఎం జగన్‌పై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్, పి.ఎస్.ఎన్ రాజులు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ వచ్చేందుకు సీఎం జగన్ డొంకతిరుగుడు వేషాలు వేస్తున్నారని మండిపడ్డారు.
Murthy Yadav Fire on Rishikonda Excavations: సీఎం జగన్ విశాఖ పరిపాలన, రిషికొండ తవ్వకాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్, చోడవరం ఇన్‌ఛార్జ్ పి.ఎస్.ఎన్ రాజు విశాఖలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ..''విశాఖ వచ్చేందుకు జగన్ డొంకతిరుగుడు వేషాలు వేస్తున్నారు. రుషికొండపై సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మాణం జరుగుతోంది. రుషికొండపై 9.88 ఎకరాలపై తవ్వకాలకే అనుమతి పొందారు. కానీ, రుషికొండపై 22 ఎకరాలు తవ్వి, ఉల్లంఘనలకు పాల్పడ్డారు. రుషికొండపై పర్యవరణ అనుమతులను ఉల్లంఘించారు. రుషికొండ తవ్వకాలపై సీఆర్‌జెడ్ ఉల్లంఘనలు జరిగాయి. అమరావతి నుంచి ఆఫీసులు తరలించొద్దని కోర్టులు చెప్పాయి.'' అని ఆయన అన్నారు.