ద్వారంపూడి దిష్టి బొమ్మను దగ్ధం చేసిన జనసైనికులు - latest news of kakinada city mla viral speech
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దిష్టిబొమ్మను విశాఖ జిల్లా అనకాపల్లిలో జనసైనికులు దగ్ధం చేశారు. ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో ద్వారంపూడిపై ఫిర్యాదు చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే సహించేది లేదని హెచ్చరించారు.