లాక్డౌన్ నేపథ్యంలో విశాఖలో జనసేన పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. విశాఖ జిల్లా పాయకరావుపేటకు చెందిన జనసేన పార్టీ నేత గెడ్డం బుజ్జి ఆధ్వర్యంలో గుంటపల్లి, పెద్దిపాలెం గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు రెండు వేల కుటుంబాలకు రూ.5 లక్షల విలువ చేసే సరుకులు అందించారు. తమ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునేందుకు తమవంతు సహకారం అందిస్తున్నట్లు జనసైనికులు వివరించారు.
పాయకరావుపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - payakaropeta janasena leaders latest updates
లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు సహాయం అందించేందుకు దాతలు, ప్రజా ప్రతినిధులు ముందుకు వస్తున్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జనసేన పార్టీ నాయకులు పేదలకు నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందజేశారు.
పాయకరావుపేటలో పేదలకు కూరగాయల పంపిణీ చేసిన జనసైనికులు