ఎలమంచిలిలో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న సింహాద్రి బార్ అండ్ రెస్టారెంట్ మూసేయాలని ధర్నా చేశారు. నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ జాతీయ రహదారిపై బైఠాయించారు. పార్టీ కార్యకర్తలు అతనికి అండగా తరలివచ్చారు. ఎక్సైజ్ అధికారులు రావాలంటూ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బార్‌పై చర్యలు తీసుకునే వరకు ఉద్యమం కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు. రోడ్డు మధ్యలో కూర్చోని ధర్నా చేయటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగింది.
బార్‌ను మూసేయాలని జనసేన నేత ధర్నా - elamanchili latest news
నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న బార్‌ను మూసేయాలని కోరుతూ దుకాణం ఎదుట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలిలో నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ సుందరపు విజయ్ కుమార్ ఆందోళన చేశారు.
![బార్‌ను మూసేయాలని జనసేన నేత ధర్నా protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10069695-657-10069695-1609422616154.jpg)
జనసేన నేత ధర్నా