ప్రభుత్వ భూములు అమ్మవద్దని జనసేన ధర్నా - Janasena dharna for land issue vishaka district
విశాఖ జిల్లా గాజువాక ఆగనంపూడిలోని ప్రభుత్వ భూమిని వేలంలో అమ్మవద్దని జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. భూమి వేలాన్ని జనసేన వ్యతిరేకిస్తుందని ఆ పార్టీ నాయకుడు కోన తాతారావు పేర్కొన్నారు.

ప్రభుత్వం భూములు అమ్మవద్దని జనసేన ధర్నా
విశాఖ జిల్లా గాజువాక ఆగనంపూడిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. గాజువాక ఆగనంపూడిలోని సర్వే నంబర్ 27/49లో 50సెంట్ల ప్రభుత్వ భూమిని ఈ నెల 29న వేలంలో అమ్మడానికి ప్రయత్నిస్తుందని... అందుకు తమ పార్టీ వ్యతిరేకమని గాజువాక జనసేన నాయకుడు కోన తాతారావు పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ప్రజల ఆస్తి... ప్రభుత్వ ప్రయోజనాల కోసం భూములను అమ్మితే చూస్తూ ఊరుకోబోమని ఆయన అన్నారు.