Janasena corporator: రుషికొండను పవన్ కల్యాణ్ సందర్శిస్తే ఉలికిపాటు ఎందుకని జనసేన కార్పొరేటర్ మూర్తియాదవ్ వైకాపా నేతలను ప్రశ్నించారు. రుషికొండ నిర్మాణాల్లో పరిమితికి మించి తవ్వకాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. అవాస్తవమైతే మహానగర పాలక సంస్థ నుంచి అనుమతి తెచ్చిన ప్లాన్‌ను బయటపెట్టేందుకు ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని నిలదీశారు.
'అనుమతుల ప్రకారమే రుషికొండలో తవ్వకాలు చేపట్టాలి' - రుషికొండ నిర్మాణాలు
Janasena corporator: రుషికొండ వ్యవహారంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. వైకాపా నేతలు తప్పు చేయనప్పుడు.. పవన్‌కల్యాణ్ రుషికొండలో పర్యటిస్తే భయమెందుకని జనసేన నేతలు ప్రశ్నిచారు. నగర పాలక సంస్థ నుంచి తెచ్చిన అనుమతి ప్రకారం కాకుండా ఇష్టమొచ్చినట్లు తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు.
జనసేన
"తీసుకున్న అనుమతుల ప్రకారమే తవ్వకాలు జరపాలి. జీవీఎంసీ ఇచ్చిన ప్లాన్‌ను ఎందుకు ప్రదర్శించడం లేదు. తెదేపా నాయకులు వెళ్తే అరెస్టులు చేస్తారు. ప్రభుత్వ ఆస్తులతో, ప్రజల ధనంతో కడుతున్న ప్రభుత్వ భవనాలను ఎందుకు చూడనివ్వటం లేదు." -మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్
ఇవీ చదవండి: