ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

PAWAN KALYAN VISHAKA TOUR: విశాఖలో ఆదివారం పవన్ కల్యాణ్ పర్యటన - విశాఖలో ఆదివారం పవన్ కల్యాణ్ పర్యటన

విశాఖ స్టీల్​ప్లాంట్​ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికులకు సంఘీభావం తెలిపేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖ రానున్నారు.

http://10.10.50.85//andhra-pradesh/30-October-2021/ap-vsp-25-30-janasena-teaser-av-3182025_30102021010742_3010f_1635536262_1046.jpeg
పవన్ కల్యాణ్ సభకు హాజరుకావాలంటూ కరపత్రాల పంపిణీ

By

Published : Oct 30, 2021, 6:43 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటంలో పట్టు వీడకుండా నిరహార దీక్షలు చేస్తున్న కార్మికులకు అండగా నిలవడానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం విశాఖ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం విశాఖ ఎయిర్ పోర్ట్ చేరుకోనున్న ఆయన.. విశాఖ స్టీల్ ప్లాంట్​లో కార్మికులను కలిసి సంఘీభావం ప్రకటిస్తారు. అనంతరం సభలో మాట్లాడతారు.

ప్రయాణ ప్రాంగణంలో కరపత్రాల పంపిణీ

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన, స్టీల్​ప్లాంట్ సభలో పెద్ద సంఖ్యలో విశాఖ వాసులు, జనసేన కార్యకర్తలు పాల్గొనాలంటూ పార్టీశ్రేణులు కరపత్రాలు పంచి పెడుతున్నారు. ఆదివారం జరిగే సభ కోసం ఒక ప్రచార వీడియోను విడుదల చేశారు.

రోడ్డుపై నిలబడి వాహనాల్లో ఉన్నవారికి కరపత్రాలు పంచుతున్న మహిళా కార్యకర్త

ABOUT THE AUTHOR

...view details