ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీలో పవన్​కల్యాణ్​ బిజీబిజీ.. ఉత్కంఠ రేపుతున్న వరుస భేటీలు - Pawan Kalyan Delhi tour news

Pawan Kalyan Delhi tour latest updates: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. వరుస భేటీలతో పవన్ కల్యాణ్ దిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. భేటీల్లో పవన్ ఏయే అంశాల గురించి చర్చిస్తున్నారు..? ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు..? సమావేశాలన్నీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా ముందు ఏ విషయాలపై మాట్లాడనున్నారు..? అనే అంశాలు తీవ్ర ఆస్తకిని కల్గిస్తున్నాయి.

Pawan Kalyan
Pawan Kalyan

By

Published : Apr 4, 2023, 1:17 PM IST

Updated : Apr 4, 2023, 3:28 PM IST

Pawan Kalyan Delhi tour latest updates: జనసేన అధినేత పవన్ కల్యాణ్ దిల్లీ పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది. వరుస భేటీలతో పవన్ కల్యాణ్ దిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌తో సమావేశమైన ఆయన.. నేడు మరికొంతమందితో భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ వరుస భేటీలు రాష్ట్రంలో ఉత్కంఠను రేకెతిస్తున్నాయి. భేటీల్లో పవన్ ఏయే అంశాల గురించి చర్చిస్తున్నారు..? ఇంకా ఎవరెవరిని కలవబోతున్నారు..? సమావేశాలన్నీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా ముందు ఏ విషయాలపై మాట్లాడనున్నారు..? అనే అంశాలు తీవ్ర ఆస్తకిని కల్గిస్తున్నాయి.

కొనసాగుతున్న పవన్ దిల్లీ పర్యటన:వివరాల్లోకి వెళ్తే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ నుంచి సోమవారం హస్తినకు చేరుకున్న విషయం తెలిసిందే. నిన్నటి నుంచి పవన్ కల్యాణ్.. బీజేపీ ముఖ్య నేతలతో, కేంద్ర మంత్రులతో భేటీలు అవుతున్నారు. ఇప్పటికే ఇప్పటికే కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌‌తో, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌తో సమావేశమయ్యారు. మంగళవారం మరోసారి బీజేపీ ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మురళీధరన్‌‌తో భేటీ అయిన పవన్.. ఆంధ్రప్రదేశ్​లో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితులపై, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి, భవిష్యత్‌ కార్యాచరణతోపాటు ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

భేటీలు ముగిశాక మాట్లాడుతా:జనసేనానితో పాటు ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సైతం చర్చల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియా ప్రతినిధులు.. పవన్‌ కల్యాణ్‌ను కలిసి వరుస భేటీల గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన భారతీయ జనతా పార్టీ ముఖ్యనేతలందరినీ కలిసిన తర్వాత భేటీల్లో చర్చిస్తోన్న అంశాలతోపాటు అన్ని విషయాల గురించి మాట్లాడతానని చెప్పారు.

నేడు అమిత్‌ షాతో, జేపీ నడ్డాతో భేటీ: ఇక, మంగళవారం రోజున మురళీధరన్‌తో జరిగిన సమావేశంలో పవన్‌ కల్యాణ్‌‌తో పాటు నాదెండ్ల మనోహర్‌, బీజేపీ నేషనల్ జనరల్ సెక్రెటరీ శివ ప్రకాష్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈరోజు సాయంత్రం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యే అవకాశముందని సమాచారం. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్యనేతలతో, కేంద్ర మంత్రులో వరుసగా భేటీలు కావడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపై, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై పవన్ కల్యాణ్ భేటీల్లో చర్చిస్తున్నట్లు తెలుస్తున్నప్పటికీ భేటీల అనంతరం ఆయన మీడియాతో ఏం మాట్లాడునున్నారని ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి

Last Updated : Apr 4, 2023, 3:28 PM IST

ABOUT THE AUTHOR

...view details