జైశ్రీరామ్ నినాదం వల్ల మూక దాడులు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టాలని ప్రధానమంత్రికి సినిమా ప్రముఖులు,మేధావులు మొత్తం 69 మంది లేఖు సమర్పించారు . దీనిపై జన జాగరణ సమితి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.సమాజంలో సెలబ్రిటీలుగా చలామణి అవుతున్న పెద్దలు దేశంలో అధిక మెజార్టీలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బ తీశారని జన జాగరణ సమితి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించేలా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు.
మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలి.... - జైశ్రీరామ్ నినాదం
విశాఖలోజన జాగరణ సమితి ఆధ్యర్వంలో ప్రముఖుల చిత్రపటాలను దగ్ధం చేస్తూ ఆందోళన చేపట్టారు. జైశ్రీరామ్ నినాదంపై అసహనం వ్యక్తం చేసిన మేధావులు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
jana jagarana samithi coducted dharna at vishakapatnam district