విశాఖ సింహాద్రి అప్పన్న సన్నిధిలోని ఉద్యానవనంలోని జలధారలకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పుణ్యహారతి ఇచ్చారు. 8 ఏళ్ళుగా సింహగిరిపై జలధారలు శిథిలమైనా..దేవాదాయ శాఖ కనీసం పట్టించుకోలేదని స్వామిజీ వాపోయారు. అప్పన్న జలధారల పునరుద్ధరణకు సింహాచలం ట్రస్టు బోర్డు ముందుకొచ్చిందని..,ట్రస్టు బోర్డును అడ్డుకునేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని విమర్శించారు. అయినా అనతి కాలంలోనే జలధారలను పునరుద్ధరించిన ట్రస్టు బోర్టు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
అప్పన్న సన్నిధిలో జలధారలకు స్వరూపానందేంద్ర పుణ్యహారతి - అప్పన్న సన్నిధిలో జలధారలకు పుణ్యహారతి న్యూస్
ఎనిమిదేళ్లుగా సింహగిరిపై జలధారలు శిథిలమమైనా.. దేవాదాయ శాఖ కనీసం పట్టించుకోలేదని శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి వాపోయారు. జలధారల పునరుద్ధరణకు సింహాచలం ట్రస్టు బోర్డు ముందుకొచ్చి.. అనతి కాలంలోనే జలధారలను పునరుద్ధరించి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
అప్పన్న సన్నిధిలో జలధారలకు పుణ్యహారతి