జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్లో అమ్మకాలు తగ్గాయి. కరోనా కారణంగా 16 రోజుల అనంతరం అనకాపల్లి బెల్లం మార్కెట్ బుధవారం తెరిచారు. 47 బెల్లం దిమ్మలు వచ్చినట్లు మార్కెట్ కమిటీ కార్యదర్శి రవి కుమార్ తెలిపారు.
గవరపాలెంలో కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు చేసినందున 16 రోజుల పాటు మార్కెట్లో లావాదేవీలు నిలిపివేశారు. నేడు మార్కెట్ తెరవటంతో పెద్దఎత్తున బెల్లం వస్తుందని ఆశించారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో.. అదీ మధ్య రకం సరకు మాత్రమే వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు. సీజన్ ముగిసినందునే తక్కువగా వచ్చినట్లు రవికుమార్ చెప్పారు.