ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న విద్యా కానుక: 'ఆదర్శనీయ పథకం' - పాయకరావుపేటలో జగనన్న విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమం

ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుక... దేశంలోనే ఆదర్శనీయమైన పథకమని వైకాపా నేతలు, ఎమ్మెల్యేలు అన్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేట, అరుకులో విద్యా కానుక కిట్లను విద్యార్థులకు అందించారు.

jagananna vidya kanuka kits distribution in vishakapatnam district
జగనన్న విద్యా కానుక: దేశంలోనే ఆదర్శనీయమైన కార్యక్రమం

By

Published : Oct 8, 2020, 7:30 PM IST

రాష్ట్రంలో విద్యా విప్లవానికి సీఎం జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని... విశాఖ జిల్లా నర్సీపట్నంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ రాజశేఖర్​తో పేర్కొన్నారు. రోలుగుంట మండలం కుసర్లపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన జగనన్న విద్యా కానుకను ప్రారంభించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయని విధంగా మన రాష్ట్రంలో వినూత్న పథకాలకు శ్రీకారం చుడుతున్నారని చెప్పారు.

చోడవరం మండలం గోవాడలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యాకానుక సామగ్రిని... విద్యార్థుల తల్లులకు పంపిణీ చేశారు. విద్యార్థుల తల్లులు, వైకాపా నాయకులు జగన్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు.

పాయకరావుపేట నియోజకవర్గలోని య.స్ రాయవరం ఉన్నత పాఠశాలలో... జగనన్న విద్యా కానుక పథకాన్ని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ప్రారంభించారు. విద్యార్థులకు కిట్లను అందించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విద్యాభివృద్ధికి పెద పీట వేస్తున్నారని... ఈ పథకం ద్వారా పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉపయోగం ఉంటుందన్నారు.

మన్యంలో ప్రతి విద్యార్థికి విద్య కానుక పథకం కిట్లు అందే విధంగా చూడాల్సిన భాద్యత అధికారులుకు ఉందిని అరకు ఎమ్మెల్యే శెట్టి పాల్గుణ అన్నారు. ముంచంగిపుట్టు మండల కేంద్రంలో 199 పాఠశాలలుకు చెందిన 7384 విద్యార్థులకు విద్య కానుక కిట్లు వచ్చాయని తెలిపారు.

ఇదీ చదవండి:

ఉప్పాడ చేపలరేవులో మత్స్యకారులకు చిక్కిన భారీ చేపలు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details