ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Jagananna Smart Township: "వాళ్లకు అన్యాయం చేస్తే మాత్రం.. భూములిచ్చేది లేదు"

Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్​షిప్​ నిర్మాణం కోసం విశాఖ జిల్లా రామవరం, గంగసాని అగ్రహారం గ్రామాల్లో భూ సమీకరణకు అధికారులు ప్రజాభ్రిపాయ సేకరణ చేపట్టారు. అందరికీ న్యాయం చేస్తే భూసేకరణకు ఎటువంటి అభ్యంతరమూ లేదని గ్రామస్థులు అధికారులకు స్పష్టం చేశారు. అయితే.. పట్టా లేని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం భూములు ఇచ్చేది లేదని అన్నారు.

By

Published : Dec 27, 2021, 7:06 PM IST

'అందరికీ న్యాయం జరిగితే ఓకే.. లేదంటే భూములిచ్చేది లేదు'
'అందరికీ న్యాయం జరిగితే ఓకే.. లేదంటే భూములిచ్చేది లేదు'

Jagananna Smart Township: జగనన్న స్మార్ట్ టౌన్​షిప్​ నిర్మాణం కోసం విశాఖ జిల్లా రామవరం, గంగసాని అగ్రహారం గ్రామాల్లో భూ సమీకరణకు అధికారులు ప్రజాభ్రిపాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో పెంచల కిషోర్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో 2 పంచాయతీల గ్రామస్థులు హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.

రెండు గ్రామాల్లో మెుత్తం 226 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన జారీ చేసినట్లు ఆర్డీవో వెల్లడించారు. పట్టా కలిగిన రైతులకు అభివృద్ధి చేసిన లే అవుట్​లో 900 గజాలు స్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. పట్టా లేకుండా రైతు సాగులో ఉంటే 450 గజాలు ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపుతున్నట్లు అధికారులు గ్రామస్తులకు వివవరించారు.

దీనిపే స్థానికులు అభ్యంతరం తెలిపారు. అందరికీ న్యాయం చేస్తే భూసేకరణకు ఎటువంటి అభ్యంతరమూ లేదని, పట్టాలేని రైతులకు అన్యాయం జరిగితే మాత్రం భూములు ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వానికి భూములు ఇవ్వటంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. 30 రోజుల్లోపు తెలియజేయాలని ఆర్డీవో రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

ఏపీలో థియేటర్లు మూసేస్తుంటే ఏడుపొస్తుంది: ఆర్.నారాయణమూర్తి

ABOUT THE AUTHOR

...view details