విశాఖ మన్యంలో రెండో రోజు బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. జీవో నెం 3 పునరుద్ధరించాలంటూ గిరిజన ఐకాస ఆధ్వర్యంలో మన్యంలో 48 గంటల బంద్కు పిలుపునిచ్చారు. రెండో రోజు వ్యాపారులు స్వచ్ఛందంగా వారి దుకాణాలు మూసేశారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రధాన రహదారిలో అడ్డంకులు ఏర్పాటు చేశారు. జీవో నెం 3 పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
మన్యంలో ప్రశాంతంగా కొనసాగుతున్న ఐకాస బంద్ - jac bandh in visakha tribal
విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లో గిరిజన ఐకాస ఆధ్వర్యంలో రెండో రోజు బంద్ జరుగుతోంది. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను నిలిపివేశారు. జీవో నెం 3 ను పునరుద్ధరణకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర ఐకాస కోరుతోంది.
జీవో నెం 3 పునరుద్ధరణకు జేఏసీ డీమాండ్