ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉపాధి హామీ ఉద్యోగుల పనితీరుపై పీవో ఆగ్రహం.. - vishaka updates

విశాఖ జిల్లా పాడేరు ఏజెన్సీ జి.మాడుగుల మండలం ఉపాధి హామీ ఉద్యోగుల పనితీరు పై ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేతనాలు నిలిపివేయాలంటూ అధికారులను ఆదేశించారు.

ఐటిడిఎ అధికారి
itda officer inspection

By

Published : Apr 27, 2021, 7:25 PM IST

విశాఖ జిల్లా పాడేరు జి.మాడుగులలో ఉపాధి హామీ కార్యాలయాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏపీఓ ఈసీ కంప్యూటర్ సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. ఫలితంగా వారి వేతనాలు వెంటనే నిలిపివేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అధికారులను ఆదేశించారు. మండలంలో 12 వేల మంది కూలీలకు పని దినాలు కల్పించాల్సి ఉండగా.. రెండు వేల మందికి పని కల్పించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మళ్లీ ఇటువంటి సంఘటనలు పునరావృతమైతే ఉద్యోగాలు ఉండవు అని హెచ్చరించారు. గతంలో చాలాసార్లు హెచ్చరించినప్పటికీ విధి నిర్వహణలో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details