విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం రంగబయలు గ్రామంలో పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వరన్ ఆకస్మికంగా పర్యటించారు. మండలంలోని అత్యంత మారుమూల ప్రాంతమైన రంగబయలుకు రహదారి మార్గం సరిగ్గా లేదు. దీంతో ఆ గ్రామాన్ని సందర్శించే అధికారులు అరుదు. పీవో పర్యటనతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేశారు. మట్టిగుడా వద్ద గిరిజనులతో పీవో ముచ్చటించారు. స్థానికంగా ఉన్న సమస్యలు, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి వేయిస్తున్న నూతన రహదారి నిర్మాణం.. త్వరగా పూర్తి చేయించాలని ప్రజలు కోరారు. నవంబర్ వరకు పనులు పూర్తయ్యేలా చూస్తామని పీవో తెలిపారు. కొవిడ్ వ్యాప్తి దృష్ట్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. టీకాలు వేయించుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పీవోతో పాటు సర్పంచ్ దనియా, కార్యదర్శి, వాలంటీర్ పాల్గొన్నారు.
రంగబయలులో పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వరన్ ఆకస్మిక పర్యటన - rangabayalu latest news
విశాఖ జిల్లా ముంచంగిపుట్టు మండలం రంగబయలు గ్రామంలో పాడేరు ఐటీడీఏ పీవో వెంకటేశ్వరన్ ఆకస్మిక పర్యటన చేశారు. పంచాయతీ పరిధిలోని సమస్యలు, జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఐటీడీఏ పీవో వెంకటేశ్వరన్