ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

IT raids: ఆయన ఇంటి గేట్లకు తాళాలు వేసి మరీ.. ఐటీ సోదాలు! - విశాఖ జిల్లాలో ఐటీ సోదాలు

ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. బుధవారం ఉదయం మొదలైన సోదాలు నేడూ కొనసాగుతూనే ఉన్నాయి. వెంకటరెడ్డి ఎస్టేట్‌ గేట్లకు తాళాలు వేసి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

IT
IT

By

Published : Nov 11, 2021, 11:12 AM IST

ఆంధ్రప్రదేశ్‌ మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి(Maritime Board Chairman Kayala Venkatereddy) సహా పలువురు స్థిరాస్తి వ్యాపారులపై ఆదాయపుపన్నుశాఖ అధికారులు రెండో రోజు సోదాలు(IT raids) నిర్వహిస్తున్నారు. కాయల వెంకటరెడ్డి ఇళ్లు, ముడిదాంలోని వెంకటరెడ్డి ఎస్టేట్‌లో, కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. వెంకటరెడ్డి ఎస్టేట్‌ గేట్లకు తాళాలు వేసి ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

కె.వి.ఆర్‌.ఎస్టేట్స్‌ సంస్థ నిర్వహిస్తున్న కాయల వెంకటరెడ్డి, వైశాఖి డెవలపర్స్‌ అధినేతలైన రామకృష్ణ, సాగర్‌, సర్దార్‌ ప్రాజెక్ట్స్‌ అధినేత వెంకన్నచౌదరిల ఇళ్లు, కార్యాలయాల్లో విస్తృతంగా బుధవారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. పలువురు ఐ.టి.అధికారులు బృందాలుగా విడిపోయి వారి ఇళ్లు, కార్యాలయాల్లోని రికార్డులను, కంప్యూటర్లను, పలు పత్రాలను పరిశీలించారు. బుధవారం ఉదయం మొదలైన సోదాలు నేడు కొనసాగుతూనే ఉన్నాయి. కాయల వెంకటరెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించడంతో వైకాపా వర్గాల్లో చర్చకు దారి తీసింది. ఇటీవలే ఆయన ఏపీ మారిటైం బోర్డ్‌ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

ఇదీ చదవండి

వెలుగు కార్యాలయంలో అవినీతి.. రూ.10 లక్షలు అక్రమ వసూళ్లు

ABOUT THE AUTHOR

...view details