ఇస్కాన్ ఆధ్వర్యంలో విశాఖ లో జగన్నాథ రథ యాత్ర ఘనంగా జరిగింది. జైలు రోడ్ ఎదుట నాలుగు భారీ రథాలతో చేపట్టిన ఈ రథయాత్రను జిల్లా మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. శాసన మండలి సభ్యుడు పీవీఎన్ మాధవ్, ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉప కులపతి ఆచార్య జి నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళల కోలాటాలు, చిన్నారులు మద్దులొలికించే నృత్యాలు, రాధా కృష్ణులు వేషధారణలు అందరినీ ఆక్టట్టుకున్నాయి. యాత్ర అనంతరం గురజాడ కళాక్షేత్రంలో జగన్నాథ బలరాం, సుభద్రలకు ప్రత్యేక పూజలు చేశారు.
'వైభవంగా జగన్నాథుని రథ యాత్ర' - iscon
విశాఖలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండువగా నిర్వహించారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్ని స్వామి వారి రథాన్ని లాగారు.

'వైభవంగా జగన్నాథుని రథ యాత్ర'