విశాఖ జిల్లా చీడికాడ మండలం కోనాం మధ్యతరహా జలాశయం నుంచి ఖరీఫ్ వరినాట్లకు సాగునీటిని విడుదల చేయాలని వైకాపా నాయకులు కోరారు. శ్రేణులందరూ చీడికాడలో సమావేశమయ్యారు. సాగునీటి విడుదలపై ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముత్యాలనాయుడు స్పందించాలని కోరారు. నాట్లకి వరి నారుమళ్లు సిద్ధంగా ఉన్నాయని, నీటి విడుదలపై జలవనరుల శాఖ అధికారులకు సూచించాలని వారు విజ్ఞప్తి చేశారు.
కోనాం జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలి: వైకాపా - konam reservoir news in vishaka
విశాఖ జిల్లా కోనాం మధ్యతరహా జలాశయం నుంచి వరినాట్లకు సాగునీటిని విడుదల చేయాలని వైకాపా నాయకులు కోరారు. ఎమ్మెల్యే ముత్యాలనాయుడు సంబంధిత అధికారులకు సూచించాలని విజ్ఞప్తి చేశారు
కోనాం జలాశయం నుంచి సాగునీరు విడుదల చేయాలి: వైకాపా