విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి వరినాట్లుకి సాగునీటిని విడుదల చేశారు. కొవిడ్ నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు మాత్రమే హాజరై జలాశయం నుంచి రెండు కాలువలకు 40 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. నీటిని వృథా చేయకుండా ఉపయోగించుకోవాలని జలాశయం జేఈఈ సుధాకర్ రెడ్డి కోరారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 137 మీటర్లు కాగా, ప్రస్తుతం 135.70 మీటర్లు ఉందని తెలిపారు. జలాశయం ఆయకట్టు 19,969 ఎకరాలు ఉందన్నారు. వరినాట్లు పూర్తయ్యే వరకు సాగునీటిని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
వరినాట్లుకి పెద్దేరు జలాశయం నుంచి సాగునీటి విడుదల - జలాశయం జేఈఈ సుధాకర్ రెడ్డి
విశాఖ జిల్లా మాడుగుల మండలం పెద్దేరు జలాశయం నుంచి ఆయకట్టు ప్రాంతంలోని పొలాల్లో వరినాట్లుకి సాగునీటిని విడుదల చేశారు. ఆయకట్టు ప్రాంతంలో రైతులు వ్యవసాయ పనులు ప్రారంభించారు.
వరినాట్లుకి పెద్దేరు జలాశయం నుంచి సాగునీటి విడుదల