పాయకరావుపేట తాండవ నది వద్ద భూమి ఆనకట్టను యలమంచిలి డివిజన్ జలవనరుల శాఖ అధికారులు పరిశీలించారు. ఆనకట్ట నీటి పారుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఆనకట్ట ప్రాంతాన్ని పరిశీలించి అడ్డంకులు తొలగించే ఏర్పాట్లు చేశారు. ఈ ఖరీఫ్ సాగుకు పూర్తి స్థాయిలో సాగునీటిని అందించేందుకు కృషి చేస్తామని యలమంచిలి డివిజన్ జలవనరుల శాఖ డీఈ సుజాత తెలిపారు. సాగు నీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.
'సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు' - payakaraopeta latest news
సాగునీటి వనరుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని యలమంచిలి డివిజన్ జలవనరుల శాఖ డీఈ సుజాత తెలిపారు. తాండవ నది ఆనకట్ట వద్ద అడ్డంకులు ఎదురవుతున్నాయని రైతుల ఫిర్యాదు మేరకు యలమంచిలి డివిజన్ జలవనరుల శాఖ డీఈ సుజాత పరిశీలించారు.
తాండవ నది వద్ద భూమి ఆనకట్టను పరిశీలించిన నీటి పారుదల శాఖ అధికారి