విశాఖ నగరం అవసరాలను గమనించి, సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు కృషి చేయాలని నగర మాజీ మేయర్ సబ్బం హరి అన్నారు. ప్రజలు చెల్లిస్తున్న పన్నులకు తగిన సేవలు ప్రభుత్వం నుంచి ఆశిస్తారన్నారు. రహదారుల నుంచి పారిశుద్ధ్యం వరకు పౌరుల అంచనాలకు దగ్గరగా పని చేసినప్పుడే ప్రజలు వారిని గుర్తుపెట్టుకుంటారని తన అనుభవాన్ని వివరించారు. నీటి సరఫరా సమస్య పరిష్కారానికి తన పదవీ కాలంలో వేసిన బాట స్థిరంగా ఉందన్నారు.
'విశాఖ నగర అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించాలి'
ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం తపించటమే స్థానిక ప్రజా ప్రతినిధుల లక్ష్యం కావాలని విశాఖ నగర మాజీ మేయర్ సబ్బం హరి అన్నారు. జీవీఎంసీ కొత్తగా కలిసిన ప్రాంతాల అవసరాలకు తగ్గట్టు నగర సదుపాయాలను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. నగర పాలక సంస్థ ఎన్నికల వేళ 'ఈటీవీ భారత్'తో సబ్బం హరి ముఖాముఖి.
విశాఖ నగర మాజీ మేయర్ సబ్బం హరి
విశాఖలో ట్రాఫిక్ సమస్య వంటివి పరిష్కరించడానికి పెద్దగా నిధులు అవసరం లేదని సబ్బం హరి అన్నారు. అన్ని శాఖల సమన్వయం చిత్తశుద్ధితో ఆచరణాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తే ఆ ప్రజా ప్రతినిధులు ఎప్పటికీ ప్రజల హృదయాలలో నిలిచిపోతారని అన్నారు.
ఇదీ చదవండి:పదవుల కోసం కాకుండా ప్రాంతం కోసం పోరాడదాం: గంటా శ్రీనివాసరావు