అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలోని భాజపా కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగాను ప్రపంచ వ్యాప్తంగా అందరూ పాటిస్తున్నారని.. మానవాళి జీవిన విధానానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.
'ఆ పని ప్రభుత్వం చేయలేకపోయింది'
నదుల అంశాల మీద తెలంగాణ స్టడీ చేసిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చేయలేక పోయిందని సోము వీర్రాజు అభిప్రాయ పడ్డారు. రాష్ట్రానికి నీటి కేటాయింపులో అన్యాయం జరుగుతోందని.. నదుల అనుసంధానం పై ప్రభుత్వం దృష్టి సారించాలని అన్నారు. కృష్ణా జలాల సాధన విషయంలో ఏపీ భాజపా ఎప్పుడు ముందుంటుందని తెలిపారు.
ఆస్తి విలువ ప్రకారం పన్నులు పెంచితే ఇబ్బందులు వస్తాయని సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదాపై పార్టీలు అనవసర రాజకీయ చేస్తున్నారని విమర్శించారు. హోదా వస్తే ఏం వస్తుందన్న ఆయన.. విశాఖలో షుగర్ ఫ్యాక్టరీకి ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ ఎక్కడికి పోదని.. కేంద్రం కార్మిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుంటుంది స్పష్టం చేశారు.