ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గ్రామాల్లో అంతర్గత, అనుసంధానిత రహదారులకు రూ. 5 కోట్ల నిధులు - విశాఖజిల్లాలో రోడ్డు భవన నిర్మాణ వార్తలు

గ్రామాల్లో సిమెంటు రోడ్లు మురుగు కాలువలు నిర్మాణానికి ఇదివరకే నియోజకవర్గానికి 15.25 కోట్లు కేటాయించారు. తాజాగా గ్రామాల్లో అంతర్గత , అనుసంధానిత రహదారులను మెటల్, బిటి రోడ్లు గా మార్చుకోవడానికి మరో 5 కోట్ల చొప్పున ఉపాధిహామీ నిధులను అందుబాటులోకి తెచ్చారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని నియోజకవర్గాలకు ఏకంగా 20 కోట్ల చొప్పున అదనపు నిధులను కేటాయించడం విశేషం. ఇప్పటివరకు ప్రాధాన్య క్రమంలో చేపడుతున్న భవన నిర్మాణాలతో పాటు రహదారి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉన్న అధికారులు నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను విధించి రహదారి నిర్మాణాలపై సమీక్షిస్తున్నారు.

గ్రామాల్లో అంతర్గత, అనుసంధానిత రహదారులకు రూ. 5 కోట్ల నిధులు
గ్రామాల్లో అంతర్గత, అనుసంధానిత రహదారులకు రూ. 5 కోట్ల నిధులు

By

Published : Nov 30, 2020, 8:50 PM IST

రాష్ట్రప్రభుత్వం తాజాగా విశాఖ జిల్లాలోని గ్రామాల్లో అంతర్గత, అనుసంధానిత రహదారులను మెటల్, బిటీ రోడ్లుగా మార్చుకోవడానికి 5 కోట్ల చొప్పున ఉపాధిహామీ నిధులను అందుబాటులోకి తెచ్చారు. సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ పరిధిలోని నియోజకవర్గాలకు ఏకంగా 20 కోట్ల చొప్పున అదనపు నిధులను కేటాయించడం విశేషం. ఇప్పటివరకు ప్రాధాన్యతా క్రమంలో చేపడుతున్న భవన నిర్మాణాలతో పాటు రహదారి పనులు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ఉన్న అధికారులు నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను విధించి రహదారి నిర్మాణాలపై కసరత్తులు చేస్తున్నారు.

రహదారి పనులకు పెద్ద మెుత్తంలో నిధులు

ప్రతి నియోజక వర్గ పరిధిలో ఎమ్మెల్యే సూచనలతో ప్రభుత్వం 15 కోట్ల విలువైన సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించడానికి అనుమతించింది. విశాఖ జిల్లాలో ఉపాధి హామీ పథకం అమలవుతున్న 10 నియోజకవర్గాల్లో 150 కోట్ల పనులను నిధులు ఇదివరకే మంజూరు చేశారు. మెటీరియల్ కాంపోనెంట్ నిధుల లభ్యత పెరగడంతో ఏజెన్సీ ప్రాంతాలకు వేర్వేరుగా అదనపు నిధులు కేటాయించారు. మైదాన ప్రాంతంలో ఉన్న ఎనిమిది నియోజకవర్గాలకు 5 కోట్ల రూపాయల చొప్పున నిధులు, ఏజెన్సీ ప్రాంతంలోని రెండు నియోజకవర్గాల కలిపి సుమారు 40 కోట్లు కేటాయించారు. మొదట కేటాయించిన 150 కోట్లుకు అదనంగా 80 కోట్లు అందుబాటులోకి రావడంతో రహదారుల అభివృద్ధికి సుమారు 230 కోట్లు ఖర్చు చేసే అవకాశం లభించింది. ఇదిలా ఉండగా రహదారి పనులకు ఈసారి పెద్ద మొత్తంలో నిధులు అందుబాటులోకి వచ్చాయని నియోజకవర్గాల వారీగా పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపించామని, ఇటీవల వాటికి ఆమోదం లభించిందని పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. వీటిని కార్యరూపంలోకి తీసుకురావడానికి లక్ష్యాలను విధిస్తామని వచ్చే ఏడాది జనవరి నాటికి ఈ పనులన్నీ పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఉన్నత అధికారులు స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి

పెరిగిన రేషన్ ధరలు.. డిసెంబర్ నుంచి డబ్బులు కట్టి తీసుకోవాల్సిందే..

ABOUT THE AUTHOR

...view details