విశాఖ జిల్లా మునగపాక మండలం మడక పాలెంలో విషాదం చోటుచేసుకుంది. చెక్ డ్యామ్‌లో ఈతకు దిగిన ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న పెంటకోట నంద(17) రోజూ చెక్ డ్యాంలో ఈత కొట్టేవాడు. రోజూలాగే శుక్రవారం కూడా డ్యాంపై నుంచి నీటిలోకి దూకాడు. ఎంతకూ పైకి తేలక పోవడంతో స్థానికులు దిగి పరిశీలించారు. అప్పటికే నంద మృతి చెందాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కలిచి వేసింది.