స్టాక్ మార్కెట్ జాబితాలో 2021-22 సంవత్సరంలో ఎల్ఐసీని చేర్చటంపై ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్ఐసీలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచాలని, 2 ప్రభుత్వ రంగ బ్యాంకులు, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేట్ పరం చేయాలని ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించటాన్ని వ్యతిరేకించారు. ప్రజలకు, దేశానికి ఎల్ఐసీ ఎంత అవసరమో తెలియజేస్తూ.. పోరాటం చేయనున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)ని బలహీనపరిచే ఏ చర్యనైనా తిప్పికొడతామని.. ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ డివిజన్ ప్రధాన కార్యదర్శి సి.ఎన్. రమణాచలం స్పష్టం చేశారు. యూనియన్ ఆధ్వర్యంలో విశాఖ ఎల్ఐసీ భవనం వద్ద క్లాస్ 3,4 ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఎల్ఐసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..