ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశ్రాంత ఆర్మీ, పోలీస్ అధికారులకు అవకాశం - police

ఎన్నికల నిర్వహణకు సరిపడా సిబ్బంది లేక అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. విశ్రాంత ఆర్మీ, పోలీసు అధికారులు సహకరించాలని కోరుతున్నారు.

రక్షణ సిబ్బంది

By

Published : Apr 3, 2019, 9:48 AM IST

మీడియాతో అధికారులు
ఎన్నికలబందోబస్తుకు సంబంధించి విశ్రాంత ఆర్మీ, పోలీసు అధికారులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొనాలని నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లడ్డా కోరారు. విశాఖ నగరంలో ఎన్నికల విధులు నిర్వర్తించేందుకు 15 కంపెనీల కేంద్ర బలగాలు కావాలని అడగ్గా.. ఇప్పటికి 4 కంపెనీల సిబ్బందేచేరుకున్నారని తెలిపారు. మిగతా బలగాలు రెండు మూడు రోజుల్లోవస్తాయని ఆయన వివరించారు. లైసెన్స్ కలిగిన ఆయుధాలు వినియోగిస్తున్న ఇద్దరు మినహా మొత్తం 819 ఆయుధాలుస్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఆ ఇద్దరి చిరునామా సరిగా లేని కారణంగా వారిపై కేసు నమోదు చేశామన్నారు. వ్యాపారస్థులు 50వేలకు మించి నగదును తరలించేటప్పుడు అందుకు తగిన పత్రాలువెంట కచ్చితంగా తీసుకువెళ్లాలని... లేకుంటే ఆమొత్తాన్ని సీజ్ చేస్తామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాటంనేని భాస్కర్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details