ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేడు భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ కవ్రత్తి - ఐఎన్ఎస్ కవ్రత్తి నౌకపై వార్తలు

భారత నౌకాదళంలోకి ఐఎన్ఎస్ కవ్రత్తి చేరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఈ నౌకను నౌకాదళంలోకి గురువారం ప్రవేశపెట్టనున్నారు. జలాంతర్గాముల కదలికలను పసిగట్టగలిగే అత్యాధునిక వ్యవస్థలు ఈ యుద్ద నౌకలో ఉన్నాయి.

INS Kavratti to join Indian Navy
భారత నౌకాదళంలోకి చేరనున్న ఐఎన్ఎస్ కవ్రత్తి

By

Published : Oct 21, 2020, 9:51 PM IST

Updated : Oct 22, 2020, 3:35 AM IST

యాంటీ సబ్​మెరైన్ వార్​ఫేర్ తరగతిలో చివరిదైన ఐఎన్ఎస్ కవ్రత్తి గురువారం భారత నౌకాదళంలోకి చేరనుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే ఈ నౌకను నౌకాదళంలో ప్రవేశపెట్టే కార్యక్రమం నిర్వహించనున్నారు. నౌకా దళంలో ప్రాజెక్టు 28 కమోర్ట తరగతి కింద నాలుగు నౌకలు దేశీయంగానే రూపొందించారు. వీటిని దేశీయ డిజైన్‌తో రూపొందించిన ఈ సబ్‌మెరైన్ వార్‌ఫేర్..... డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ ఇచ్చిన ప్రమాణాలతో నిర్మించారు.ఈ నౌకలను ఆత్మనిర్భర్ భారత్ కింద కోల్​కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ రూపొందించింది.

ప్రత్యేకతలు

యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ తరగతిలో 2014లో కమోర్ట, 2016లో కడ్మట్, 2017లో కిల్తన్ నౌకలను నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఈ తరగతిలో ఐఎన్ఎస్ కవ్రత్తి చివరిది. వీటివల్ల దేశీయంగా మన రక్షణ దళాలకు అదనపు ఆయుధ సంపత్తి సమకూరింది. ఈ నౌకల్లో అత్యున్నత స్థాయి ఆయుధాలను గుర్తించే సెన్సార్​లు ఉన్నాయి. జలాంతర్గాముల కదలికలను పసిగట్టగలిగే అత్యాధునిక వ్యవస్థలు ఈ యుద్ధ నౌకలో ఉన్నాయి. దీర్ఘకాలం సముద్రంపై పోరాడగల సత్తా ఈ నౌకల సొంతం. సముద్రంపై ఈ నౌక సత్తాను పలుమార్లు విజయవంతంగా పరీక్షించారు. అన్ని రకాల పరీక్షలను తట్టుకుని ఈ నౌకలు తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకున్నాయి.

ఇదీ చదవండి: విజయవాడ దుర్గగుడి వద్ద విరిగిపడిన కొండచరియలు

Last Updated : Oct 22, 2020, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details