భారత - ఇండోనేషియా పరస్పరం నిరంతరాయంగా పంచుకోవడం వల్ల.. భావ సారూప్యం ఉన్న దేశాలు ఒకరికొకరు అండగా ఉండాలని ఇరు దేశాలు ఆకాంక్షించాయి. 5 క్రయోజనిక్ కంటైనర్లతో.. వంద మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్, 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు ఇతర సామగ్రితో ఇండోనేషియా రాజధాని జకార్తాకు ఐఎన్ఎస్ ఐరావత్ చేరుకుంది. కొవిడ్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు పొరుగుదేశాలకు సాయంలో భాగంగా భారత్ వీటిని పంపింది.
ఐఎన్ఎస్ ఐరావత్ లాండింగ్ షిప్ ట్యాంక్ రకానికి చెందిన నౌక.. ఉభయ చరిగా నేలపైనా, నీటిపైనా పోరాటానికి అవసరమైన యుద్ధ ట్యాంకులు, మిలటరీ కార్గో తీసుకువెళ్లే బాధ్యతలను నిర్వర్తిస్తోంది. మానవీయ సాయంలోనూ ఈ నౌకను సరకు రవాణా కోసం ఎక్కువగా వినియోగించడం పరిపాటి.