ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగన్, విజయసాయిరెడ్డిల నిర్బంధంపై విచారణ - vijaya sai reddy

2017లో ప్రత్యేక హోదా కోరుతూ విశాఖలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీకి హాజరయ్యేందుకు విచ్చేసిన జగన్​, విజయసాయిరెడ్డిలను పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. దీనిపై రాజ్యసభ సభా హక్కుల కమిటీ విశాఖ పోలీసులను ప్రశ్నించింది.

జగన్ నిరసన(ఫైల్)

By

Published : Jul 26, 2019, 7:36 AM IST

Updated : Jul 26, 2019, 10:21 AM IST

విశాఖ విమానాశ్రయంలో రెండేళ్ల క్రితం జనవరి 25న అప్పటి ప్రతిపక్షనేత జగన్, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలను నిర్బంధించిన ఘటనపై నిన్న విచారణ జరిగింది. విశాఖ పోలీస్ కమిషనర్ మీనా, ఏఎస్​పీ చిట్టిబాబు రాజ్యసభ సభా హక్కుల కమిటీ ముందు హాజరై వివరణ ఇచ్చారు. గురువారం సాయంత్రం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నేతృత్వంలోని సభాహక్కుల కమిటీ ముందు సభ్యుల ప్రశ్నలకు వారు సమాధానమిచ్చారు. సుమారు గంటన్నరపాటు కమిటీ సభ్యులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఏఎస్​పీ చిట్టిబాబు నుంచి ఎక్కువ సమాచారం రాబట్టినట్లు తెలిసింది. ప్రత్యేక హోదా కోరుతూ విశాఖకు వచ్చిన తమను రన్​వే నుంచి నిర్బంధంలోకి తీసుకోవటంపై ఎంపీ విజయసాయిరెడ్డి సభాహక్కుల కమిటీకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం మీనా మీడియా మాట్లాడారు. కమిటీ సభ్యులు తమ సమాధానాల పట్ల సంతృప్తి చెందారని భావిస్తున్నామని చెప్పారు.

Last Updated : Jul 26, 2019, 10:21 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details