గత 2నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. బకాయిపడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నోటిలో గడ్డి పెట్టుకొని నిరసన తెలిపారు. నగరాన్ని శుభ్రంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న తమకు జీతాలు ఇవ్వకపోవడం శోచనీయమని ఆవేదన చెందారు. జీవీఎంసీ యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడం వల్ల గడ్డి తినాల్సిన పరిస్థితులు తలెత్తాయని వాపోయారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి బకాయి జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
జీతాలు చెల్లించాలని జీవీఎంసీ కార్మికుల వినూత్న నిరసన - విశాఖ జీవిఎంసి గాంధీ విగ్రహం
బకాయిపడ్డ జీతాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ పారిశుద్ధ్య కార్మికులు వినూత్న రీతిలో ఆందోళన చేపట్టారు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నోటిలో గడ్డి పెట్టుకొని నిరసన తెలిపారు.
జీతాల బకాయిల చెల్లించాలని జీవిఎంసి కార్మికుల వినూత్న నిరసన