విశాఖ మన్యం పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి వెళుతున్న ఇన్నోవా వాహనం నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ప్రమాదవశాత్తు ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. వీరిని త్వరితగతిన పాడేరు ఆసుపత్రికి అంబులెన్స్‌లో తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని తనిఖీలు చేయగా... కారు సీట్ల కింద రెండు ప్లాస్టిక్ కవర్లలో రెండు కేజీల గంజాయిని గుర్తించారు. వీటిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టిన ఇన్నోవా... కారులో 2 కేజీల గంజాయి - paderu latest news
పాడేరు నుంచి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపూర్ ప్రాంతానికి వెళ్తున్న ఇన్నోవా వాహనం అదుపుతప్పి నక్కలపుట్టు వద్ద అల్లూరి విగ్రహం దిమ్మను ఢీకొట్టింది. వాహనంలో వెళ్తున్న ఐదుగురిలో ఇద్దరకు గాయాలయ్యాయి. వీరిని అంబులెన్స్‌లో పాడేరు ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు వచ్చి ఇన్నోవా వాహనం తనిఖీ చేయగా... సీటు కింద రెండు ప్లాస్టిక్ కవర్లలో గంజాయి ఉన్నట్లు తెలుసుకున్నారు.
నక్కలపుట్టు వద్ద రోడ్డు ప్రమాదం