విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూపార్క్‌లో 17 రోజుల క్రితం జన్మించిన ఓ జిరాఫీ కూన మృతి చెందింది. ఈ జిరాఫీ కూన నెలలు నిండకుండానే జన్మించినప్పటికి... చలాకీగానే ఉండేదని అటవీ అధికారులు చెబుతున్నారు. తల్లి జిరాఫీకి పాలు లేకపోవడం వల్ల అవు పాలు పట్టించారు. వేరే ఆహారం అందించాలని యత్నించినా తీసుకోకపోవడంతోపాటు తల్లి జిరాఫీ దగ్గరకు రానివ్వకపోవడంతో పరిస్ధితి విషమించి చిన్ని జిరాఫీ కన్నుమూసిందని జూ క్యూరేటర్ యశోదాబాయి వెల్లడించారు.
అమ్మ పాలు లేక బుల్లి జిరాఫీ మృత్యువాత !! - జిరాఫీ కూన
జంతువులను జంతుప్రదర్శనశాలలో చాలా భద్రంగా చూస్తారు అటవి అధికారులు. అలా జాగ్రత్తగా చూసుకున్నా... విశాఖ జిల్లాలోని జూలో జిరాఫీ కూన మృతి చెందింది. దాని తల్లి తండ్రి జూలోనే ఉంటున్నాయని అధికారులు చెబుతున్నారు.
అమ్మ పాలు లేక మృతి చెందిన బుల్లి జిరాఫీ