ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అభివృద్ధి ఫలాలు, అవకాశాల కల్పనలో సమన్యాయం జరిగేలా చూడాలి' - visakha district collector news

'ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్' పేరిట దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర ఉత్సవాలను జరిపేందుకు కేంద్రం నిర్ణయించింది. ఈ సందర్భంగా విశాఖలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర వేడుకలు నిర్వహించారు.

india's 75 years independence celebrations in visakhapatnam
విశాఖలో 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాలు ప్రారంభం

By

Published : Mar 12, 2021, 7:39 PM IST

అన్ని వర్గాల వారికి అభివృద్ధి ఫలాలు అందేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ వి.వినయ్ చంద్ అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో వేడుకలు నిర్వహించారు. జిల్లా పాలనాధికారితో పాటు అడిషనల్​, అసిస్టెంట్​ కలెక్టర్లు, జీవీఎంసీ కమిషనర్ నాగలక్ష్మి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి.. వేడుకలు ప్రారంభించారు.

స్వాతంత్రం వచ్చిన 75 ఏళ్లలో దేశం అనేక రంగాల్లో అభివృద్ధి.. కొన్ని సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని కలెక్టర్ తెలిపారు. అయితే వాటిని అధిగమించి మరింత ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరూ ఉత్తమ స్థాయిలో కృషి చేయాలన్నారు. అభివృద్ధి ఫలాలు, అవకాశాల కల్పనలో సమన్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి ప్రారంభమైన స్వాతంత్ర ఉత్సవాలు 75 వారాలు పాటు నిర్వహించనున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి:'అదే స్వాతంత్ర్య యోధులకు అసలైన నివాళి'

ABOUT THE AUTHOR

...view details