దుబాయ్ సహా ఇతర దేశాల్లోని విదేశీయులకు వైద్యంతో పాటు అవసరమైన సాయాన్ని అందించేందుకు ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. పలితంగా.. ఆయా దేశాల్లోని భారతీయులు తిండికి సైతం ఇబ్బంది పడుతున్నారు. దుబాయ్‌లో భారతీయుల వీసా గడువు పొడిగించనప్పటికీ.. ఉద్యోగాలు, ఆదాయం లేక స్వదేశానికి వచ్చేందుకు వారు ఎదురుచూస్తున్నారు.
8 నెలల క్రితం అక్కడికి వెళ్లిన విశాఖకు చెందిన ఓ తెలుగు జంట.. ఇదే తరహాలో ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కరోనా కారణంగా ఉద్యోగాలు పోవటంతో కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అరబ్ దేశాల్లోని చిక్కుకున్న భారతీయులను వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం విమానాలు నడుపుతున్నా... తమ వంతు ఎప్పుడు వస్తుందన్న నిరీక్షణ వారిని మానసిక వేదనకు గురిచేస్తోందని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమూ తమను వెనక్కి రప్పించేందుకు ప్రయత్నించాలని వేడుకుంది.