భారత నావికాదళం... కేజీహెచ్‌కు మరో 5 పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్స్ సెట్లను అందించింది. ఈ రోజు ఉదయం విశాఖ ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీక్ వల్ల ప్రభావితమైనవారికి త్వరితగతిన ఆక్సిజన్ అందించడానికి సహకరించింది. నావల్ డాక్ యార్డ్ విశాఖపట్నం (ఎన్డీవీ) నుంచి సాంకేతిక బృందాలు కేజీహెచ్‌కు వీటిని సరఫరా చేశాయి.
కొవిడ్-19 మహమ్మారికి ఏకకాలంలో ఆరుగురు రోగులకు ఆక్సిజన్ సరఫరా చేయడానికి ఒక జంబో సైజు ఆక్సిజన్ బాటిల్‌ను ఎనేబుల్ చెయ్యడానికి... ఈ పోర్టబుల్ మల్టీఫీడ్ ఆక్సిజన్ మానిఫోల్డ్ వ్యవస్థను ఎన్డీవీ రూపొందించింది. కొవిడ్ ఆసుపత్రులలో వీటిని ఉపయోగంచటం కోసం... ఇటువంటి 25 సెట్లను జిల్లా పరిపాలన అధికారులకు అందించామని నావికాదళ అధికారి తెలిపారు.