దేశ నౌకాదళానికి చెందిన ఐఎన్ఎస్ తల్వార్... 54 టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్‌తో భారత తీరానికి చేరుకున్నట్లు నేవీ ఉన్నతాధికారులు వెల్లడించారు. బహ్రెయిన్ నుంచి మంగుళూరు పోర్ట్‌కు ఈ మెడికల్ ఆక్సిజన్ చేరుకున్నట్లు తెలిపింది. మరో నౌక ఐఎన్ఎస్ ఐరావత్ సింగపూర్ నుంచి 3,600 ఆక్సిజన్ సిలిండర్లు, 27టన్నుల సామర్ద్యం ఉన్న ఎనిమిది ఆక్సిజన్ ట్యాంకులు తీసుకువస్తున్నట్లు నౌకాదళం పేర్కొంది.
ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం చర్యలు - oxygen shortage in india
దేశంలో ఆక్సిజన్ కొరతను అధిగమించేందుకు భారత నౌకాదళం చర్యలు చేపట్టింది. విదేశాల నుంచి ఆక్సిజన్ తీసుకువస్తున్నట్లు తెలిపింది.
భారత నౌకాదళం