ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివిధ రకాల వైద్యాలను కలపడంపై ఐఎంఏ ఆందోళన - ఆయుర్వేద వైద్యులకు వెసులుబాటు కల్పించడంపై అనకాపల్లిలోని భారతీయ వైద్య మండలి సభ్యలు ధర్నా

విభిన్న వైద్య విధానాలను కలిపి చికిత్స అందించేందుకు వీలుగా.. కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఐఎంఏ సభ్యులు డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద నిరసనకు దిగారు. ఆయుర్వేదం కోర్సు పూర్తి చేసినవారు.. ఆధునిక వైద్యంలోని 58 రకాల శస్త్ర చికిత్సలు చేయవచ్చన్న కేంద్రం జీవోపై మండిపడ్డారు.

doctors protest
నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులు

By

Published : Dec 8, 2020, 8:50 PM IST

ఆయుర్వేద కోర్సు పూర్తి చేసిన వారి విషయంలో కేంద్రం ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఎన్టీఆర్ ఆస్పత్రి వద్ద భారతీయ వైద్య మండలి సభ్యులు నిరసనకు దిగారు. ఆధునిక వైద్య విధానంలోని 58 రకాల శస్త్రచికిత్సలను.. ఆయుర్వేద వైద్యులూ నిర్వహించే విధంగా అనుమతించడాన్ని ఐఎంఏ వర్కింగ్ కమిటీ సభ్యుడు డాక్టర్ డీడీ నాయుడు ఖండించారు.

అన్ని వైద్య విధానాలనూ కలిపి చికిత్స అందిస్తే.. ప్రజల ప్రాణాలకు హాని కలుగుతుందని నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ఐఎంఏ అనకాపల్లి సంఘం అధ్యక్షులు డాక్టర్ నాగేశ్వరరావు, కార్యదర్శి మురళితో పాటు ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రావణ్ కుమార్, ఇతర వైద్యులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details