ఇండియా మారిటైం సదస్సు వల్ల అంతర్జాతీయ పెట్టుబడులను ఆహ్వానించేందుకు అవకాశం మరింత పెరుగుతుందని విశాఖ పోర్టు ఛైర్మన్ కె. రామ్మోహనరావు అన్నారు. మార్చి రెండు నుంచి నాలుగు వరకు జరిగే ఈ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రారంభించి ప్రసంగిస్తారన్నారు. 26 వేల కోట్ల విలువైన 24 అవగాహనా ఒప్పందాలు ఇప్పటికే సిద్దమయ్యాయని.. మరో నాలుగైదు వేల కోట్ల ఎంఓయూలు చర్చల దశల్లో ఉన్నాయని వివరించారు. మారిటైం సదస్సుకి సంబంధించిన ముందస్తు కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించారు.
ఇందులో స్టీవ్ డోర్స్, ఛాంబర్ అఫ్ కామర్స్, ఇతర వాణిజ్య వ్యాపార సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి మాండవీయ వర్చువల్ విధానంలో దిల్లీ నుంచి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. దీనికోసం ప్రత్యేకంగా అవసరమైన సమాచారాన్ని కేంద్ర నౌకాయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజీవ్ రజన్ విడుదల చేశారు. ఇప్పటికే 24వేల మంది ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని.. విద్యార్ధులు పెద్ద ఎత్తున రిజిస్టర్ చేసుకోవాలని దీనివల్ల వారికి ఈ రంగంపై అవగాహన పెంచుకునేందుకు ఇదో అవకాశమని ఛైర్మన్ అన్నారు.
డ్రెడ్జింగ్ రంగంలో రాణించేందుకు మారిటైం ఇండియా ఓ సదావకాశం..