రోజు రోజుకూ కొవిడ్ కల్లోలం సృష్టిస్తోన్న నేపథ్యంలో జంతు ప్రదర్శన శాలలను మూసివేస్తూ యజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ క్రమంలో జంతువుల ఆరోగ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ఉన్న జంతు ప్రదర్శన శాలలను నిరవధికంగా మూసివేశారు. జూ మూసివేతతో సందర్శకుల కేరింతలకు అలవాటు పడిన జంతువులు స్థబ్దుగా ఉంటున్నాయి.
కరోనా వల్లే జూలో ఆటవిడుపు..
జూల్లో జంతువులు ఢీలా పడటం గమనించిన రాష్ట్ర అటవీ శాఖ, వాటిల్లో నూతన ఉత్తేజాన్ని నింపేందుకు చర్యలు చేపట్టాయి. ఆటవిడుపు ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో జంతువుల ఆటవిడుపు కోసం ఎన్క్లోజర్ల్లో పలు ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఫలితంగా జంతువులన్నీ వాటితో ఆడుతూ ఆహ్లాదంగా గడుపుతున్నాయి.