విశాఖ మన్యంలో వాతావరణ మార్పులతో .... దట్టమైన పొగమంచు వ్యాపించింది. ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాలు, తుపాను కారణంగా చలి తీవ్రత ఆలస్యమైనప్పటికీ... ప్రస్తుతం రోజు రోజుకీ చలి పెరుగుతుంది. ఉదయం 8 గంటలకు వాహనదారులు లైట్ల వెలుతురులోనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. పాడేరు 13, మినుములూరు 11, చింతపల్లిలో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రభాత వేళ మన్యంలో మంచుతెరలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇదీ చూడండి:
విశాఖ మన్యంలో హిమం.. చూపరులకు ఆహ్లాదం.. - visakha beautiful nature gallery news
విశాఖ మన్యం దట్టమైన పొగమంచును కప్పుకుంది. ప్రభాత వేళ మంచుతెరలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
విశాఖ మన్యంలో దట్టమైన పొగమంచు