ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అందరికి వైద్యం సక్రమంగానే అందిస్తున్నాం' - విశాఖపట్నం జిల్లాలో కరోనా వైద్యం వార్తలు

కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ మేరకు విశాఖలో నిర్వహించే కొవిడ్ వైద్యం.. బాధితులకు సక్రమంగానే అందుతోందని ఇంఛార్జ్ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి అన్నారు. ఎన్ఎమ్​లు, ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.

Incharge DMHO Vijayalakshmi respond on covid-19(corona virus) treatment at visakhapatnam district
'అందరికి వైద్యం సక్రమంగానే అందిస్తున్నాం'

By

Published : Jul 6, 2020, 12:25 PM IST

కరోనా విశాఖ వాసులను కలవరపెడుతోంది. లాక్​డౌన్ సమయంలో కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉన్న కేసుల సంఖ్య సడలింపుల తరువాత విజృంభించింది. ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యికిపైనే ఉండగా... వందల మంది ఐసోలేషన్​లో ఉన్నారు. కరోనా నివారణ దిశగా చేపడుతున్న చర్యలపై ఇంఛార్జ్ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి స్పందించారు. విశాఖలో పది కోవిడ్ సెంటర్లను ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరికైనా వైద్యం అందలేదని ఫిర్యాదు చేస్తే వెంటనే స్పందిస్తున్నామని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్ఎమ్​లు, ఆశా వర్కర్ల ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details