సింహాద్రి అప్పన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి... దీపాల వెలుగులో, కళ్లు మిరుమిట్లు గొలిపేలా దర్శనమిచ్చాడు. ఈ ఆలయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కాలభైరవున్ని దర్శించుకుంటే కోరికలు తీరుతాయని, సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాష్ట్ర నలుమూలల నుంచి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో ఈ స్వామిని దర్శించుకోవడం కోసం సందర్శకులు భారీగా వస్తుంటారు. ఇందులో భాగంగానే.. గురువారం పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాన్ని దర్శించారు.
భక్తులతో కిటకిటలాడిన కాలభైరవ ఆలయం - విశాఖపట్టణం
విశాఖ, సింహాద్రి అప్పన్న క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ స్వామిని దర్శించుకుంటే తీరని కోరికలు తీరుతాయని తమ ప్రగాఢ విశ్వాసమని భక్తులు చెప్పారు.
![భక్తులతో కిటకిటలాడిన కాలభైరవ ఆలయం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4010937-618-4010937-1564662905258.jpg)
ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం
ఆ స్వామిని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం