కరోనా లాక్ డౌన్ వల్ల మూతబడ్డ హోటళ్లు.... పునః ప్రారంభానికి తగినట్టు సిద్ధం అవుతున్నాయి. విశాఖలో అత్యవసర సేవలు అందిస్తున్న నోవాటెల్ హోటల్.... కరోనా వ్యాప్తి నివారణకు వినూత్న విధానంతో నడుస్తోంది. వినియోగదారుల మధ్య భౌతిక దూరం ఉండేలా పాండా బొమ్మలు పెట్టి నియంత్రణను అమలు చేస్తున్నారు.
సిబ్బంది సైతం కరోనాను పోలిన హెల్మెట్లు పెట్టుకుని.... 'మాస్క్ ధరించండి' అని రాసి ఉన్న ఫ్లకార్డులతో వినియోగదారులను అప్రమత్తం చేస్తున్నారు. అడుగడుగునా శానిటైజర్‌ను అందుబాటులో ఉంచారు. లాక్ డౌన్ నిబంధనల సడలింపు తర్వాత వినియోగదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో... అందుకు అనుగుణంగా యాజమాన్యాలు వినూత్న మార్పులు చేస్తున్నాయి.