విశాఖ జిల్లా గోపాలపట్నంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జి.మాడుగుల ప్రాంతానికి చెందిన పి. వెంకటేశ్ అనే వ్యక్తి ఆటోలో లక్ష్మీనగర్‌కు 26 కిలోల గంజాయిని తరలిస్తున్నాడన్న సమాచారంతో టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. సరకును, ఆటోను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కె.కోటపాడు మండలం గుల్లిపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గ్రామంలో పెద్ద ఎత్తున అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయనే సమాచారంతో కె.కోటపాడు ఎస్సై నారాయణరావు, సిబ్బంది కలిసి పాన్ షాపుల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఓ దుకాణంలో 19 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గొలుసు దుకాణం నిర్వహిస్తున్న నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించినా, నిల్వచేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
భీమునిపట్నం మండలం పరిధి తాళ్లవలసలో సుమారు 8 లక్షల విలువైన గుట్కా బస్తాలను భీమిలి పోలీసులు పట్టుకున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ జి.శ్రీనివాస్ తెలిపారు.
చిత్తూరు జిల్లాలో..
తిరుపతిలో గంజాయిని విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. బస్‌స్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహించిన పోలీసులు నిందితుల నుంచి కిలో గంజాయితో పాటు ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
అనంతపురం జిల్లాలో..