విశాఖ జిల్లా చీడికాడ మండలం దిబ్బపాలెం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి 90 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు చీడికాడ ఎస్సై సంతోష్ చెప్పారు. వారిపై కేసు నమోదు చేసి, రిమాండ్కు పంపినట్లు తెలిపారు. మాడుగుల మండలం కూర్మనాథపురం, కాశీపురం ప్రాంతాల్లో నాటుసారా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై రామారావు చెప్పారు. వారి నుంచి 15 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులపై కేసు నమోదుచేసి, రిమాండుకి పంపించామని పోలీసులు వెల్లడించారు.
మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్ - విశాఖ అక్రమ మద్యం పట్టివేత వార్తలు
మద్యం అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 90 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు.

మద్యం అక్రమ రవాణా.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్